ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో తెరాస జోరు

0
57
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌

32 జిల్లాలలో 25 జిల్లాలో జిల్లా పరిషత్ స్థానాలలో టి.ఆర్.ఎస్.ఆధిక్యత సాధించింది.
3545 ఎం.పి.టి.సిలు 398 జడ్.పి.టి.సి స్థానాలలో టి.ఆర్.ఎస్. విజయం సాధించింది.
కాంగ్రెస్ పార్టీ 65 జడ్.పి.టి.సి స్థానాలను, 1375 ఎం.పి.టి.సి స్థానాలలో,
బిజెపి 7జెడ్.పి.టి.సి స్థానాలలోను, 201 ఎం.పి.టి.సి స్థానాలను గెలుచుకొంది.
టిడిపి 24 ఎం.పి.టి.సి స్థానాలను గెలుచుకొంది. ఇతరులు 4 జెడ్.పి.టి.సి స్థానాలు, 571 ఎం.పి.టి.సి స్థానాలలో విజయం సాధించారు.


తెలంగాణ ప్రాదేశిక ఎన్నికల ఫలితాల్లో తెరాస జోరు కొనసాగుతోంది.ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. హైదరాబాద్‌ మినహా 32 జిల్లాల్లో ఈ ఎన్నికలు జరగ్గా అన్ని జిల్లాల్లోనూ కారు జోరు కొనసాగుతోంది. మొత్తం 5,659 ఎంపీటీసీ, 534 జడ్పీటీసీ స్థానాలకు జరుగుతున్న ఓట్ల లెక్కింపులో అధికార పార్టీ తెరాస అభ్యర్థులు దూసుకుపోతున్నారు.

ఇప్పటివరకు వెల్లడైన ఫలితాలను పరిశీలిస్తే 3212 ఎంపీటీసీ, 62 జడ్పీటీసీ స్థానాల్లో తెరాస అభ్యర్థులు విజయం సాధించారు. రెండో స్థానంలో కాంగ్రెస్‌ కొనసాగుతోంది. 1202 ఎంపీటీసీ, 9 జడ్పీటీసీ స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే, 190 ఎంపీటీసీ స్థానాల్లో భాజపా, 20 ఎంపీటీసీ స్థానాల్లో తెదేపా, 511 ఎంపీటీసీ స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం పీప్రీ-2 ఎంపీటీసీ స్థానానికి లాటరీలో భాజపా అభ్యర్థిని విజయం వరించింది.

ఇక్కడ తెరాస, భాజపా అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. డ్రా తీయగా భాజపా అభ్యర్థి ఎర్ర వ్వను విజయం వరించింది. అంతకుముందు రెండు ఓట్ల ఆధిక్యంతో తెరాస అభ్యర్థి గెలిచినట్లు ప్రక టించారు. అయితే భాజపా అభ్యర్థి రీకౌంటింగ్‌కు డిమాండ్‌ చేయడంతో మళ్లీ ఓట్లను లెక్కించారు. దీంతో ఇద్దరికి సమానంగా ఓట్ల వచ్చినట్లు తేలింది. చివరకి ఎన్నికల అధికారి లాటరీ ద్వారా విజేతను ప్రకటించారు.