175 కోట్ల వసూళ్లను రాబట్టిన ‘మహర్షి’

0
33
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
టాలీవుడ్‌ అగ్రకథానాయకుడు మహేష్‌బాబు నటించిన ‘మహర్షి’ సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది.ఈ చిత్రం కేవలం 18 రోజుల్లో రూ.175 కోట్లు (గ్రాస్‌) రాబట్టిందని చిత్ర బృందం మంగళవారం ప్రకటించింది.

ఈ మేరకు పోస్టర్‌ను విడుదల చేసింది. ‘శ్రీమంతుడు’, ‘భరత్‌ అనే నేను’ సినిమాల తర్వాత రూ.150 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టిన మహేశ్‌ మూడో సినిమా ఇది కావడం విశేషం. ఇప్పటి వరకు ఏ హీరోకు ఈ ఘనత (రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన మూడు సినిమాలు ఉండటం) దక్కలేదని విశ్లేషకులు అంటు న్నారు.

రైతులు, వ్యవసాయం నేపథ్యంలో దర్శకుడు వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో ‘వీకెండ్‌ వ్యవసాయం’ అనే హ్యాష్‌ట్యాగ్‌ బాగా ట్రెండ్‌ అయ్యింది. తాజాగా ఓ మహిళ తన కుమార్తెకు ‘మహర్షి’ సినిమా వల్ల వ్యవసాయంపై అవగాహన కల్గిందని ట్వీట్‌ చేశారు. అంతేకాదు చిన్నారి తన అభిప్రాయాల్ని కూడా రాసిందని చెప్పారు.

దీన్ని చూసిన మహేశ్‌ ‘‘మహర్షి’ ఎఫెక్ట్‌’ అని పోస్ట్‌ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.‘మహర్షి’లో పూజా హెగ్డే కథానాయిక పాత్ర పోషించారు. అల్లరి నరేష్‌ కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమ కూర్చారు. దిల్‌రాజు, ప్రసాద్‌ వి పొట్లూరి, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు.