మిట్స్‌ పరిశోధక విద్యార్థికి డాక్టరేట్‌ ప్రదానం చేసిన జేఎన్‌టియుఏ

0
13
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల) నందు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ (ఈసీఈ) పరిశోధనల విభా గంలో చదువుతున్న కె.సాయి వేణు ప్రతాప్ విద్యార్థికి అనంతపురంలోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నా లాజికల్ యూనివర్సిటీ వారు డాక్టరేట్ పట్టాను అందించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువరాజ్ తెలిపారు.

ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డాక్టర్.ఎస్.ఏ.కె జిలానీ ఆద్వర్యంలో “ఏ రియల్-టైం ఇమేజ్ మొసైసింగ్ యూజింగ్ ఇంవారియంట్ ఫ్యూచ్యర్స్” అనే అంశంపై కళాశాలలో చేసిన పరిశోధనలకుగాను జె.యెన్.టి.యు అనంతపురం వారు డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు.

డాక్టరేట్ పొందిన కె.సాయి వేణు ప్రతాప్ ను కళాశాల యాజమాన్యం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. యువరాజ్, విభాగాధిపతి డాక్టర్ యస్.రాజశేఖరన్ తదితరులు అభినందనలు తెలిపారు.