పూల్వామాలో ఎన్‌కౌంటర్‌ – ముగ్గురు తీవ్రావాదుల హతం

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
జమ్మూకశ్మీర్‌లోని పూల్వామాలో ఉగ్రవాదులకు,భద్రతా బలగాలు మధ్య శనివారం ఉదయం ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ముష్కరులను మట్టుబెట్టినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పుల్వామా జిల్లా అవంతిపొర ప్రాంతంలోని పంజ్‌గామ్‌ గ్రామ సమీపంలో ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఆపరేషన్‌లో 130 బెటాలియన్‌ సీఆర్‌పీఎఫ్‌, స్పెషల్‌ ఆపరేషన్‌ గ్రూప్‌ కమాండోలు కూడా పాల్గొన్నా రు. సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించగా భద్రతా బలగాలు వాటిని దీటుగా తిప్పికొట్టాయి. దీంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే హతమయ్యారు.

మృతి చెందిన వారి వివరాలతో పాటు, వారు ఏ ఉగ్రసంస్థకు చెందినవారన్న దానిపై విచారణ జరుపుతు న్నామని పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల ఏరివేత కోసం ఉదయం నుంచి జరిపిన గాలింపు చర్యలను నిలిపివేసినట్లు వెల్లడించారు. దీంతో ఆపరేషన్‌ ముగిసినట్లు ప్రకటించారు.