తిరుమల శ్రీవారిని దర్శించుకొన్న కర్ణాటక సీఎం కుమారస్వామి

0
26
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
కలియుగ ప్రత్యక్ష దైవం, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని శని వారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మాజీ ప్రధాని దేవెగౌడ, మంత్రి రేవన్న శ్రీవారిని దర్శించుకు న్నారు.

దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవెగౌడ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. తాము కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటామని, కర్ణాటకలో కాంగ్రెస్‌ కూటమి 18సీట్లు గెలుస్తుందని ఈసందర్భంగా కుమారస్వామి తెలి పారు.

అదేవిధంగా వీఐపీ ప్రారంభ దర్శనసమయంలో ఏపీ డీజీపీ ఆర్‌.పి.ఠాకూర్‌ శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజే శారు.