చంద్రగిరిలో ఏడుచోట్ల రీ పోలింగ్‌ – చిత్తూరు కలెక్టర్‌ పి.ఎస్‌.ప్రద్యుమ్న

0
18
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – చంద్రగిరి
చిత్తూరుజిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో మరో రెండు కేంద్రాల్లో రీపోలింగ్‌ జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదించిందని జిల్లా ఎన్నికల సంఘం అధికారి ప్రద్యుమ్న తెలిపారు.

దీంతో ఇప్పటికే ప్రకటించిన 5 పోలింగ్‌ కేంద్రాలతో(ఎన్‌ఆర్‌ కమ్మపల్లి, పులివర్తివారిపల్లి, కొత్తకండ్రిగ, కమ్మపల్లి, వెంకట్రామపురం) పాటు కొత్తగా ప్రకటించిన కాలురు, కుప్పం బాదురుల కేంద్రాలలో ఆది వారం రీపోలింగ్‌ జరగనుంది.పోలింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేస్తున్నామని కలెక్టర్‌ ప్రద్యుమ్న చెప్పారు.

చంద్రగిరి పరిధిలో మొత్తం ఏడు చోట్ల నిర్వహించే రీపోలింగ్‌కు పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని కలెక్టర్‌ పేర్కొన్నారు. ప్రతి పోలింగ్‌ బూత్‌ వద్ద 250 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. రీపోలింగ్‌కు కేంద్రాలలో ఏ చిన్న పొరపాటు జరిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్‌ ఉంటుందని పేర్కొన్నారు.