కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని నరేంద్ర మోదీ

0
3
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఉత్తరఖండ్‌లోని పవిత్రమైన కేదార్‌నాథ్‌ ఆయాన్ని శనివారం ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించారు. చార్‌ధామ్‌ యాత్రలో కేదార్‌నాథ్‌ ఆలయం ఒకటిగా ప్రసిద్ధిగాంచింది.ఈ ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న మోదీ.. అక్కడి నుంచి కేదార్‌నాథ్‌ వెళ్లారు. కేదారీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. మోదీ రాక నేపథ్యంలో ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.

రెండు రోజుల పాటు ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న మోదీ ఆదివారం బద్రీనాథ్‌ ఆలయాన్ని కూడా సందర్శించనున్నారు. కేదార్‌నాథ్‌ ఆలయాన్ని మోదీ గతంలోనూ పలుమార్లు దర్శించుకున్నారు. గతేడాది నవంబరు నెలలో దీపావళి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

అంతకుముందు 2017లో రెండు సార్లు కేదార్‌నాథ్‌కు వచ్చారు. చివరి విడత పోలింగ్‌కు ఒక్కరోజు ముందు మోదీ కేదార్‌నాథ్‌ ఆలయాన్ని దర్శించుకోవడం ఆసక్తిగా మారింది. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలోనూ రేపు ఎన్నిక జరగనుంది.