కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో సమావేశమైన చంద్రబాబు

0
12
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోరాతో సమావేశమయ్యారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి అసెంబ్లీ నియోజక వర్గంలోని 5 పోలింగ్‌ కేంద్రాల్లో ఈ నెల 19న రీపోలింగ్‌ వ్యవహారాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నారు.

రీపోలింగ్‌కు సీఈసీ ఆదేశాల వెనుక కారణాలేంటి? రీపోలింగ్‌కు ఆదేశాలు ఇచ్చేముందు ఆయే అంశాల ను ప్రాతిపదికగా తీసుకున్నారు? ఎన్నికలు పూర్తైన చాలా రోజుల తర్వాత సీఈసీ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందనే విషయాన్ని ఆయన లేవనెత్తే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా చంద్రబాబు వివిధ రాజకీయ పార్టీల ముఖ్య నేతలతో సమావేశమవుతారు. ఈ నెల 23 నిర్వహించతలపెట్టిన విపక్ష పార్టీల సమావేశానికి ఏయే పార్టీలకు ఆహ్వానాలు పంపాలనే అంశంపై చర్చించే అవకాశముంది. కాంగ్రెస్‌ అధినాయకత్వంలో చంద్రబాబు చర్చలు జరిపే అవకాశ ముంది.

ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌, ఎల్‌జేడీ అధినేత శరద్‌ యాదవ్‌, దిల్లీ సీఎం కేజ్రీవాల్‌, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వంటి జాతీయ నేతలతో చంద్రబాబు భేటీ కానున్నారు. దిల్లీ నుంచి చంద్రబాబు లఖ్‌నవూ వెళ్లి మాయావతితో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.