ఐసీసీ క్రికెట్‌ ప్రపంచకప్‌ అధికారిక గీతం విడుదల

0
5
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
మే 30 నుండి ప్రపంచకప్‌ క్రికెట్‌ పండుగ ప్రారంభం కానుంది.ఇందుకు సర్వం సిద్ధం చేస్తోంది ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు.ఇకపోతే మైదానాల్లో ప్రేక్షకులను ఉర్రూతలూగించేందుకు వన్డే ప్రపంచకప్‌ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గీతం సిద్ధమైంది.

శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రపంచకప్‌ అధికారిక గీతాన్ని విడుదల చేసింది. ‘స్టాండ్‌ బై’ పేరిట సాగే ఈ గీతాన్ని ఇంగ్లండ్‌లో ప్రఖ్యాతి గాంచిన మ్యూజిక్‌ బ్యాండ్‌ ‘రుడిమెంటల్‌’ సహ కారంతో నూతన గాయకుడు లోరిన్‌ ఆలపించాడు. మే 30 నుంచి ప్రపంచకప్‌ జరిగే ప్రతి మైదానంలో ఈ పాట సందడి చేయనుంది.