సినిమా థియేటర్లలో మౌలిక వసతులు కల్పించాలి – మదనపల్లి సబ్‌కలెక్టర్‌ కీర్తి చేకూరి

0
22
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
మదనపల్లి డివిజన్‌ పరిధిలో ఉన్న సినిమా థియేటర్లలో కనీస సౌకర్యాలు త్రాగునీరు, మరుగుదొడ్లు, ఉండే విధంగా చూసుకోవాలని సబ్ కలెక్టర్ శ్రీమతి కీర్తి చేకూరి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం సబ్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో మదనపల్లి డివిజన్ పరిధిలోని మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం వి.కోట, కలికిరి, పీలేరు, బి.కొత్తకోటలకు చెందిన సినిమా థియేటర్ల యాజమానులతో సినిమా థియేటర్లలో మౌలిక వసతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు వినోదం కోసం సినిమా థియేటర్లకు వస్తే వారిని ఇబ్బం దులకు గురిచేస్తున్నారని తెలిపారు. సినిమా టికెట్లు, అధిక రేటు పెట్టి అమ్మితే సినిమా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు, మీ సినిమా థియేటర్లకు సంబంధించి లైసెన్సులు రెన్యువల్ చేసుకున్నారా ఇంకా ఎవరైనా లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోకుంటే వెంటనే చేసుకోవాలని తెలిపారు.

ప్రతి సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు శుద్ధమైన త్రాగునీరు ఉచితంగా ఏర్పాట్లు చేయాలన్నారు. వాహనాల కోసం పార్కింగ్ స్థలం ఉండేలా చూసుకోవాలని,వాహనాలకు పార్కింగ్ ఫీజును అధికంగా వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.మరుగుదొడ్లు శుభ్రంగా ఉంచాలని, ఎసిని సక్రమంగా వినియోగించాలని తెలిపారు. రోజుకు 4 ప్రదర్శనలు కంటే ఎక్కువ షోలు ప్రదర్శించినట్లైతే ఆ సినిమా ధియేటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, మీకు పర్మిషన్ ఉంటే ప్రదర్శించుకోవాలని తెలిపారు.

సినిమా థియేటర్లలో అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అగ్నిప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే ప్రణాళికలతో ఉండాలని సూచించారు, ప్రతి సినిమా థియేటరులో అగ్నిప్రమాదాల జరిగిన వెంటనే నివారించుటకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే వాటిపై అవగాహన కలిగివుండాలని తెలిపారు. ప్రతి సినిమా థియేటర్లలో ప్రమాదం జరిగే ముందు అలారం మోగే విధంగా అలారంను ఏర్పాటు చేసుకోవాలని సినిమా ధియేటర్ల యజమానులను ఆదేశించారు.

ప్రతి సినిమా థియేటర్లలో ఫిర్యాదుల బాక్సును ఏర్పాటు చేయాలని, ప్రజలు సినిమా థియేటర్లలో కనీస సౌకర్యాలు లేకున్నా, సినిమా టికెట్లు, శీతల పానీయాలు, తిను భండరాలు త్రాగునీరు బాటిల్స్ పై అధిక రేట్లకు అమ్మినట్లయితే వెంటనే అధికారులకు తెలియజేయాలని ప్రేక్షకులకు సూచించారు.

advertisment

సినిమా థియేటర్ల తనిఖి సమయంలో అన్ని సౌకర్యాలు లేకుంటే అయా సినిమా థియేటర్లపై చర్యలు తీసుకుంటామని, లైసెన్సులు రద్దు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి సినిమా ధియేటరులో అగ్ని ప్రమాదాల నివారణపై మాక్ అగ్నిప్రమాదాలు చేపట్టాలని యజమానులకు సూచించారు.ఈ కార్య క్రమంలో సబ్ కలెక్టరేట్ ఏ.ఓ వెంకటేశ్వరరావు, విన్సెంట్, భారతి డివిజన్ పరిధిలోని సినిమా థియేటర్లు యజమానులు తదితరులు పాల్గొన్నారు.