వాయిదా పడిన ఏపీ ఎంసెట్‌ ఫలితాలు

0
15
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఏపీ ఎంసెట్‌ ఫలితాలను వాయిదా వేస్తున్నట్లుగా ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ విజయరాజు తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో ఏర్పడిన జాప్యమే ఫలితాల వాయిదాకు కారణమని ఆయన వివ రించారు.

తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు ఇంటర్‌ మార్కుల పునఃలెక్కింపు, పరిశీలన అనంతరం ఈనెల 27న ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలంగాణ ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి వెల్లడించారని పేర్కొన్నారు. తెలంగాణకు చెందిన సుమారు 36,698 మంది విద్యార్థులు ఏపీ ఎంసెట్‌ రాశారని, ఈ నేపథ్యంలో ఫలి తాలను వాయిదా వేస్తున్నట్లు వివరించారు.

షెడ్యూల్‌ ప్రకారం ఏపీ ఎంసెట్‌ ఫలితాలను 18వ తేదీ శనివారం ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ ఇంటర్‌ విద్యామండలి ఏపీ ఎంసెట్‌ కన్వీనర్‌కు మార్కుల జాబితాను ఇచ్చింది. వీటి ఆధారంగా ర్యాంకు లు కేటాయించి ఫలితాలు విడుదల చేయాలని ఉన్నత విద్యామండలి భావించింది.