మహానేత వైఎస్సార్‌కు ఘననివాళులర్పించిన వై.ఎస్‌.జగన్‌

0
16
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇడుపులపాయ
వైఎస్సార్‌ కడపజిల్లా పర్యటనలో ఉన్న ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధినేత వై.ఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి మహానేత డాక్టర్‌.వై.ఎస్‌.రాజశేఖర్‌ రెడ్డికి ఘననివాళి అర్పించారు.ఆయన శుక్రవారం ఉదయం ఇడు పులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ను సందర్శించారు.

వైఎస్‌ జగన్‌తో పాటు కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, పలువురు పార్టీ నేతలు కూడా మహానేత కు అంజలి ఘటించారు. అనంతరం వైఎస్‌ జగన్‌ హైదరాబాద్‌ బయల్దేరారు.కాగా నిన్నరాత్రి వైఎస్‌ జగన్‌ కడప అమీన్‌పూర్‌ దర్గాను సందర్శించారు.

దర్గా నిర్వహకులు ఆయనకు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించి చాదర్‌ సమర్పించారు. అనంతరం దర్గా పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేనితో కలిసి ఇఫ్తార్‌ కార్యక్ర మంలో పాల్గొన్నారు. వైఎస్‌ జగన్‌ రాకతో దర్గా ప్రాంగణమంతా భక్తులు, అభిమానులతో కిక్కిరిసిపో యింది.