బి.కొత్తకోటలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన వ్యవసాయశాఖ ఏడీ

0
15
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
బి.కొత్తకోట మండల పరిధిలో గల ఎరువులు మరియు పురుగుమందుల దుకాణాలను శుక్రవారం మదనపల్లి డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏడీ) కె.శివశంకర్‌ స్థానిక వ్యవసాయాధికారిణి ప్రేమలతతో కలసి సంయుక్తముగా తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో భాగంగా ఎరువులు మరియు పురుగుమందుల యొక్క ఫారం ‘‘ఓ’’లు,ప్రిన్సిపల్‌ సర్టిఫి కేట్లు,కాలపరిమితి ముగిసిన సదరు కంపెనీలు స్టాకు అమ్మకాలను నిలుపుద చేశారు.వీటి విలువ సుమారు 37,20,000 రూపాయలుగా నిర్ధారించారు.అదేవిధంగా 5,87,000 రూపాయలల విలువ గల పురుగుమందులు ఉన్నాయన్నారు.ఈ తనిఖీలు మరోవారం రోజుల వరకు చేపట్టడం జరుగుతుంద న్నారు.

ఇకపోతే మే నెల చివరివారంలో వేరుశనగ విత్తన కాయలను రైతులకు రాయితీపై సరఫరా చేయుటకు తగు చర్యలు తీసుకుంటున్నామన్నారు.దీనికి అదనంగా ‘‘చిరుధాన్యాల సాగు’’ను ప్రోత్సహించడానికి మదనపల్లె డివిజన్‌లోని రైతులకు రాగులు,కొర్రలు,సామలు,అరికెలు,అండ కొర్రలను రాయితీపై సర ఫరా చేయుటకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు.

అదేవిధంగా జీనుగు మరియు జనుము పచ్చి రొట్ట విత్తనాలను 75% రాయితీతో మండల వ్యవసాయా ధికారి కార్యాలయంలో సిద్ధంగా ఉన్నాయన్నారు.ఇకపోతే ఈ వేసవిలో పడే వర్షాలకు రైతులు తమ పొలాల్లో ‘ఒంటిమడకతో లోతు దుక్కులు’ చేసుకున్నట్లయితే వర్షాకాలంలో పడే వర్షపు నీటిని తమ భూమిలో ఇంకింప చేసుకొని, తద్వారా నేలలో తేమ శాతం ఎక్కువ రోజలు నిలువ ఉండడానికి ఆస్కారం ఉంటుందని తెలిపారు.

వేరుశనగ మరియు ఇతర పంటలు వర్షాభావ పరిస్థితులలో ఉపకరిస్తుందని తెలిపారు.ఈ తనిఖీల్లో మదనపల్లి వ్యవసాయ సహాయ సంచాలకులు కె.శివశంకర్‌,ఏవో ప్రేమలత,ఎంపిఈవో జి.ఫిరోజ్‌ఖాన్‌ మరియు రైతు క్రిష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.