ప్రపంచకప్‌కు భారత్‌ నుండి మూడో వ్యాఖ్యాతగా ఎంపికైన గంగూలీ

0
15
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
భారతజట్టు మాజీ కెప్టెన్‌, ఎడమచేతి వాటం సొగసరి బ్యాట్స్‌మెన్‌ సౌరవ్‌ గంగూలీ మే 30 నుండి ఇంగ్లాండ్‌లో ప్రారంభమయ్యే ప్రపంచకప్‌లో సందడి చేయనున్నారు.భారత వ్యాఖ్యాతలు హర్షభోగ్లే, సంజయ్‌ మంజ్రేకర్‌తో పాటు గంగూలీ కూడా గొంతు కలపనున్నాడు.

2019 ప్రపంచకప్‌లో వ్యాఖ్యాతలుగా వ్యవహరించే 24 సభ్యుల పేర్లను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) ప్రకటించింది. అందులో భారత్‌ నుంచి ముగ్గురికి అవకాశం దక్కింది. శ్రీలంక నుంచి కుమార సంగక్కర ఒక్కడికే అవకాశం వచ్చింది.

పాకిస్థాన్‌ నుంచి వసీం అక్రమ్‌, రమీజ్‌ రాజాలతో పాటు బంగ్లాదేశ్‌ నుంచి అతార్‌ అలీఖాన్‌ ప్యానల్‌లో చోటు సంపాదించారు. ఐసీసీ ఈసారి మహిళలకు కూడా అవకాశం కల్పించింది. ఇషా గుహ, మెలనీ జోన్స్‌, అలిసన్‌ మిచెల్‌ కూడా ఈ టోర్నీలో వ్యాఖ్యానించనున్నారు.