నూతన వలసవిధానానికి శ్రీకారం చుట్టిన డోనాల్డ్‌ ట్రంప్‌

0
361

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
భారత ఐటీ నిపుణులతోపాటు అమెరికాకు వెళ్లాలనుకునే పలు దేశాల ఐటీ నిపుణులకు అమెరికా తీపికబురు అందించింది.ఐటీ నిపుణులకు మేలు చేసేలా ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. గ్రీన్‌కార్డుల జారీలో అత్యున్నత ప్రతిభ ఉన్న వలస ఉద్యోగుల కోటాను 12 శాతం నుంచి 57శాతానికి పెంచుతున్నట్లు వెల్లడించారు.

దీంతో పాటు వలసదారులు ఇంగ్లిష్ తప్పనిసరిగా నేర్చుకుని ఉండాలని, అలాగే అమెరికా చరిత్ర, సంస్కృతి తదితర అంశాలపై నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. దాదాపు 54 ఏళ్ల క్రితం అమెరికా వలస విధానంలో సంస్కరణలు చేశారు. ఆ తర్వాత ఈ విధానంలో మార్పులు చేయడం మళ్లీ ఇప్పుడే.

ప్రస్తుతమున్న విధానం వల్ల నైపుణ్యవంతులైన యువతకు అవకాశాలు దక్కట్లేదని, అందుకే ఈ ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించామని ట్రంప్‌ చెప్పారు. ఈ విధానం ద్వారా వలసదారుల వయ సు, ప్రతిభ, ఉద్యోగావకాశాలు, అమెరికా చరిత్రపై అవగాహన తదితర వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ దేశంలో శాశ్వత నివాసం పొందే అవకాశం కల్పిస్తామన్నారు.

నైపుణ్యం, ప్రతిభ ఆధారణంగా అమెరికా వచ్చే వారికి తలుపులు తెరిచామని ట్రంప్‌ అన్నారు. ప్రస్తుత మున్న విధానం ప్రకారం అమెరికాలో ఉంటున్న విదేశీయులను వివాహం చేసుకునే వారికి 60శాతం, వేర్వేరు రంగాల్లో నిపుణులైన వారికి 12శాతం కోటాతో గ్రీన్‌కార్డులు జారీ చేస్తున్నారు. అయితే కొత్త విధానంలో నిపుణుల కోటాను 12శాతం నుంచి 57శాతానికి పెంచారు. అవసరమైతే మరింత పెంచు తామని ట్రంప్‌ వెల్లడించారు.