టైమ్స్‌ ‘‘మోస్ట్‌ డిసైరబుల్‌ ఫర్‌ ఎవర్‌’’ జాబితాలో మహేష్‌బాబు పేరు

0
50

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
‘మహర్షి’ సినిమా విజయంతో మంచి జోరుమీదున్నాడు ప్రిన్స్‌ మహేష్‌బాబు.ఆ ఆనందాన్ని ఆస్వాది స్తున్న వేళ ఆయనకయ మరో అరుదైన గౌరవం దక్కింది. టైమ్స్ 2018 సంవత్సరంకి గాను “మోస్ట్ డిసైరబుల్ ఫర్ ఎవర్” లిస్ట్ లో మహేష్ పేరును చేర్చడం జరిగింది. ఇప్పటివరకు సల్మాన్ ఖాన్, షారూ క్ ఖాన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ మాత్రమే ఈ లిస్ట్ లో పేరు సంపాదించారు .

సౌత్ నుండి ఈ ఘనత సాధించిన మొట్ట మొదటి స్టార్ మహేష్ కావడం మరో విశేషం. 2010 నుండి టైమ్స్ ప్రక‌టించిన మోస్ట్ డిజైర‌బుల్ మెన్ లిస్ట్‌లో మ‌హేష్ ఏదో ఒక స్థానాన్ని సంపాదించుకుంటూనే ఉన్నాడు. ఇంతవ‌ర‌కు ఏ సౌత్ హీరో కూడా ఈ ఘ‌న‌త సాధించ‌లేదు. ఇక ప్రతిష్టాత్మక టైమ్స్ మ్యాగజైన్ ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా అత్యధిక “మోస్ట్ డిసైరబుల్ మెన్” లిస్ట్ ని కూడా విడుదల చేసింది .

యూత్ లో ఆయా హీరో లకు ఉన్న పాపులారిటీ ఆధారంగా ర్యాంక్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తుంది. యురి చిత్రంతో దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందిన బాలీవుడ్ హీరో విక్కీ కౌశ‌ల్ తొలి స్థానాన్ని ద‌క్కించుకోగా, మూడో స్థానాంలో ర‌ణ్‌వీర్ సింగ్‌, నాలుగో స్థానంలో విజ‌య్ దేవ‌ర‌కొండ నిలిచారు. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 12వ స్థానాన్ని ద‌క్కించుకున్నారు.