కర్ణాటక మాజీ మంత్రి ఇంట్లో సందడి చేసిన పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి

0
46
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – పెద్దతిప్పసముద్రం
కర్ణాటక రాష్ట్రం చింతామణిలో ఓ వివాహవేడుకకి తంబళ్లపల్లి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి ద్వారక నాథరెడ్డి హాజరయ్యారు.విషయం తెలుసుకున్న కర్ణాటక మాజీ మంత్రి కె.ఎం.కృష్ణారెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి వారి ఇంటికి రావాల్సిందిగా ఆయనను కోరారు.రాజశేఖర్‌ రెడ్డి అభ్యర్థన మేరకు ద్వారక నాథరెడ్డి వారిగృహానికి వెళ్లారు.

దీంతో మాజీ మంత్రి కుటుంబసభ్యులు ద్వారకనాథరెడ్డికి ఘనస్వాగతం పలికారు.వారి కుటుంబసభ్యుల ను ఆయన మర్యదపూర్వకంగా పలకరించారు.అనంతరం ఆంధ్రా – కర్ణాటక సరిహద్దుల్లో ఉన్నటువంటి తంబళ్లపల్లి నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేయుటకు తమవంతు సహకరాన్ని అందిస్తామ ని హామీ ఇచ్చారు. మే 23న వెలువడే ఎన్నికల ఫలితాల్లో ఏపీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అఖండ మెజారిటీతో విజయం సాధిస్తుందని వారు ధీమా వ్యక్తం చేశారు.

దీనిపై పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ పొరుగురాష్ట్రం మాజీ మంత్రి కె.ఎం.కృష్ణారెడ్డి కుటుంబ సభ్యుల ఆదరణ మరువలేనిదన్నారు.అదేవిధంగా తంబళ్లపల్లి నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తామ నడం శుభపరిణామమ్నారు.ఈ కార్యక్రమంలో పీటీఎం వైఎస్సార్‌సీపీ యువనాయకుడు రవిచంద్రా రెడ్డి, నాయకులు వెంకట్‌ రెడ్డి,సందీప్‌ మరియు సతీస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.