విపక్ష నేతలకు కృతజ్ఞతలు తెలిపిన బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ

0
267

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో తనకు మద్ధతునిచ్చిన విపక్ష నేత లందరికీ పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి,తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ కృతజ్ఞతలు తెలి పారు.ట్వీట్‌లో ఈ విషయాన్ని ఆమె తెలియజేశారు.ఏడో దశ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం తెరపడ నుంది.

అయితే టీఎంసీ, బీజేపీల మధ్య చెలరేగిన ఘర్షణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం.. పశ్చిమ బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారం చేయాలని, ఆ తర్వాత చేయొద్దని ఆదేశాలిచ్చింది. దీంతో ఈసీపై మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం తెలుపుతూ ఆమె నిరసన వ్యక్తం చేశారు.

దీంతో మమతకు మాయావతి, అఖిలేష్ యాదవ్, చంద్రబాబుతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చింది. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మమత ట్వీట్ చేశారు. భారతీయ జనతా పార్టీ డైరెక్షన్‌లో ఈసీ పని చేస్తుందని మమత ధ్వజమెత్తారు. బీజేపీకి బెంగాల్ ప్రజలు తగిన సమాధానం చెప్తారని మమ తా బెనర్జీ స్పష్టం చేశారు.