బెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై ఎన్నికల సంఘం ఆగ్రహం

0
320

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో లోక్‌సభ ఎన్నిక ప్రచారంలో భాగంగా చోటుచేసుకున్న హింసా త్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తంచేసింది. రేపటితో ఎన్నికల ప్రచారం ముగించా లని ఆదేశించింది. కేంద్ర ఎన్నికల సంఘం మొదటిసారి 324 అధికరణాన్ని ప్రయోగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.

రేపు రాత్రి 10 గంటల నుంచే ఎన్నికల ప్రచారం ముగించాలని ఈసీ ఆదేశించింది. చివరి దశ ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఇంకా 9 స్థానాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈసీ నిర్ణయంతో ఈ తొమ్మిది నియోజక వర్గాల్లో రేపటితో ఎన్నికల ప్రచారం ముగిసిపోనుంది.324 అధికరణాన్ని ప్రయోగించడం బహుశా ఇదే మొదటిసారి.

ఈశ్వరచంద్ర విద్యా సాగర్‌ విగ్రహం ధ్వంసం కావడం పట్ల ఈసీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిని రాష్ట్ర అధికారులు గుర్తించి, అదుపులోకి తీసుకుంటారని భావిస్తున్నామని ఎన్నికల అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. చివరి దశ ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో ప్రచార గడువు శుక్రవారంతో ముగియనుంది.