డయాబెటిస్‌ నియంత్రిణకు దోహదపడే ఉల్లిపాయలు

0
119

మనఛానల్‌ న్యూస్‌ – హెల్త్‌ డెస్క్‌
ఉల్లి చేసిన మేలు…తల్లి కూడా చేయదనేది సామెత.ఇది అక్షరాల సత్యమంటున్నారు వైద్య శాస్త్రవే త్తలు.భారతీయులు నిత్యం ఉల్లిపాయ లేనిదే ఏ వంటకం చేయలేరు. ముఖ్యంగా నాన్‌వెజ్ వంట‌కాల్లో చ‌క్క‌ని వాస‌న‌, రుచి రావాలంటే ఉల్లిపాయ‌ల‌దే కీల‌క‌పాత్ర‌. అయితే ఉల్లిపాయలు కేవ‌లం రుచికే కాదు, మ‌న‌కు అనేక ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాల‌ను అందివ్వ‌డంలోనూ ముఖ్య పాత్ర పోషిస్తాయి.

ఈ క్ర‌మంలోనే ఉల్లిపాయలను రోజూ తింటే షుగ‌ర్ బాగా త‌గ్గుతుంద‌ని సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌ నాల్లో తేలింది. 100 గ్రాముల ఎర్ర‌ ఉల్లిపాయ‌ల‌ను తింటే కేవ‌లం 4 గంట‌ల్లోనే షుగ‌ర్ త‌గ్గుతుంద‌ట‌. ముఖ్యంగా టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఉల్లిపాయ‌ల‌ను తింటే వారిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ త‌గ్గి త‌ద్వారా షుగ‌ర్ కూడా కంట్రోల్ అవుతుంద‌ట‌.

ఈ విష‌యాన్ని ఎన్విరాన్‌మెంట‌ల్ హెల్త్ ఇన్‌సైట్స్ అనే జ‌ర్న‌ల్‌లో ప్ర‌చురించారు. 100 గ్రాముల ఎర్ర‌ ఉల్లిపాయ‌ల‌ను తింటే 4 గంట‌ల వ్య‌వ‌ధిలో బ్ల‌డ్ షుగ‌ర్ కంట్రోల్ అవుతుంద‌ని సైంటిస్టులు తేల్చారు. క‌నుక టైప్ 2 డ‌యాబెటిస్ ఉన్న వారు రోజూ ఎరుపు రంగులో ఉండే ప‌చ్చి ఉల్లిపాయ‌ల‌ను తినాల‌ని సైంటిస్టులు సూచిస్తున్నారు.