పులివెందులలో వై.ఎస్‌.జగన్‌ను కలుస్తున్న నాయకులు, కార్యకర్తలు

0
71
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – పులివెందుల
విదేశీ పర్యటన అనంతరం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మంగళవారం రాత్రి పులివెందుల చేరు కున్నారు.పులివెందుల పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజు అందరితో మమేకమవుతున్నారు. భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం 8.30 నుంచి నాయకులు, కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉన్నారు.

ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ను కలిసేందుకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. అలాగే పలువురు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ఆయనను కలిసి కౌంటింగ్‌పై చర్చించారు. ఇవాళ సాయంత్రం స్థానిక వీజే ఫంక్షన్‌ హాలులో మైనార్టీ సోదరులు ఇచ్చే ఇఫ్తార్‌ విందులో వైఎస్‌ జగన్‌ పాల్గొంటారు. గురువారం కూడా ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా వైఎస్‌ జగన్‌ మంగళవారం రాత్రి పులివెందుల చేరుకున్న విషయం తెలిసిందే. కడప విమానా శ్రయంలో అడుగుపెట్టగానే ఆయనకు పార్టీ నాయకులు, అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పులివెందుల చేరుకున్నారు. దారిపొడవునా వేచి వున్న ప్రజలకు అభి వాదం చేసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగారు.