అట్టహాసంగా ప్రారంభమైన 72వ కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు

0
28
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఇంటర్నేషనల్‌ డెస్క్‌
ఫ్రాన్స్‌లో 72వ కేన్స్‌ అంతర్జాతీయ చలనచిత్రోత్సవ వేడుకలు ఎంతో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం సాయంత్రం (ఫ్రాన్స్‌ కాలమానం ప్రకారం) వేడుకను ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ సినిమా ప్రీమియర్‌ షోతో ప్రారంభించారు.

తొలి రోజు ప్రముఖ పాప్‌ గాయని సెలీనా గోమేజ్‌ హాజరై రెడ్‌ కార్పెట్‌పై సందడి చేశారు. ఆమెతో పాటు ‘ది డెడ్‌ డోన్ట్‌ డై’ చిత్రంలోని నటీనటులు కూడా హాజరయ్యారు. మే 25 వరకు ఈ వేడుక జరుగుతుంది. ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్‌ రివేరా నదీ తీరాన ఉన్న కేన్స్‌ ప్రాంతంలో ఈ వేడుక జరుగుతోంది.ప్రపంచవ్యాప్తంగా తీసిన ఉత్తమ చిత్రాన్ని ఈ వేడుకలో ప్రదర్శిస్తారు.

అయితే ఈ ఏడాది కేన్స్‌కు భారత్‌ తరఫున ఒక్క సినిమా కూడా ఎంపిక కాలేదు. కానీ మన సెలబ్రిటీలు ఐశ్వర్య రాయ్, సోనమ్‌ కపూర్‌, కంగనా రనౌత్‌, దీపిక పదుకొణె ఈ వేడుకలో సందడి చేయబోతున్నా రు. ఈ సారి కేన్స్‌ వేడుకకు ప్రముఖ మెక్సికన్‌ దర్శకుడు అలెజాండ్రో అధ్యక్షత వహిస్తున్నారు.