తెలంగాణలో బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు – 35 మందికి గాయాలు

0
84

మనఛానల్‌ న్యూస్‌ – జయశంకర్‌ భూపాపల్లి
తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాపల్లి జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది.జిల్లాలోని మల్హార్‌ మండలం సోమన్‌పల్లి వంతెన వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడటంతో 35 మందికి గాయాలయ్యాయి.

ప్రమాద సమయంలో బస్సులో 60 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని మహదేవ్‌పూర్ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.

బస్సు డ్రైవర్ బస్సు రన్నింగ్‌లో ఉండగా గుట్కా వేసుకోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టినట్టు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. బస్సు గోదావరిఖని నుంచి భూపాలపల్లి వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జరిగింది.