జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో పదవికి రాజీనామా చేసిన వినయ్‌ దూబే

0
21
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి ఇప్పటికే విలవిల్లాడుతున్న ప్రముఖ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.విమాన సర్వీసులను పూర్తి నిలిపివేసిన అనంతరం జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి వరుసగా కీలక ఉద్యోగులు తప్పుకుంటున్నారు.

తాజాగా జెట్‌ ఎయిర్‌వేస్‌ సీఈవో వినయ్‌ దుబే రాజీనామా చేశారు. దీంతో మూలిగే నక్కమీద తాటి పండు పడ్డ చందంగా తయారైంది జెట్‌ ఎయిర్‌వేస్‌ సంస్థ పరిస్థితి.వ్యక్తిగత కారణాలరీత్యా కంపెనీ నుంచి వైదొలగుతున్నట్టు వెల్లడించారు. మంగళవారం కంపెనీ డిప్యూటీ సీఈవో, సిఎఫ్ఓ అమిత్ అగర్వాల్ కంపెనీ నుంచి వైదొలగారు.

ఒకవైపు వాటాల కొనుగోలు సంబంధించిన అంశం ఇంకా కొలిక్కి రావడంలేదు. మరోవైపు వరుసగా కీలక ఎగ్జిక్యూటివ్‌లు కంపెనీకి గుడ్‌బై చెపుతున్నారు. ముఖ్యంగా ఇపుడు సీఈవో రాజీనామా చేయ డం కీలక పరిణామం. కాగా ఆగష్టు 8, 2017న జెట్‌కు సీఈవోగా వినయ్ దుబే నియమితులయ్యారు.