ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా అనిల్‌ చంద్ర పునేఠా

0
28
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఆంధ్రప్రదేశ్‌ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నూతన పోస్టింగ్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికలకు ముందు అనిల్‌చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రమణ్యంను ఏపీ సీఎస్‌గా నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

పునేఠాను ఎన్నికల విధులతో సంబంధం లేని శాఖలో నియమించాలని ఈసీఐ సూచించింది. అప్ప ట్నుంచి ఆయన వెయిటింగ్‌లోనే ఉన్నారు.

ఈ నెల 31న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ఏపీ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొ రేషన్‌ ఛైర్మన్‌గా పునేఠాకు పోస్టింగ్‌ ఇస్తూ తాజాగా ఈసీ నిర్ణయం తీసుకోవడంతో సీఎస్‌ ఎల్వీ సుబ్రమ ణ్యం ఆదేశాలు జారీ చేశారు.