తిరుమల ఘాట్ లో ఆర్టీసీ బస్సుకు తప్పిన ముప్పు – ప్రయాణికులు సురక్షితం

0
222
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – తిరుమల
తిరుమల ఘాట్ రోడ్డులో మంగళవారం అదుపు తప్పిన ఆర్.టి.సి బస్సు లోయలో పడబొయింది. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహారించడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. బస్సు ఏ మాత్రం ముందుకెళ్లినా
లోయలో పడి ఎంతో మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడేది. మంగళవారం మద్యాహ్నం తిరుపతి నుంచి భయలు దేరిన ఆర్టీసీ బస్సు ఘాట్ సెక్షన్ లోకి వెళ్లిన కొంత సేపటికి అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది..అయితే రోడ్డు కు చెట్లు పొదలు ఉండడంతో బస్సు ముందుకు వెళ్లలేక ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు బెంబేలు ఎత్తారు. ప్రమాదం నుంచి భయటపడడానికి చేసిన ప్రయత్నాలలో పలువురికి గాయాలయ్యాయి.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు వినాయక స్వామి ఆల యం దాటిన తర్వాత అదుపుతప్పి కారును ఢీకొట్టి లోయ వైపు దూసుకెళ్లింది. ఈ క్రమంలో చెట్టు కొమ్మలు, వృక్షాలు అడ్డుగా ఉండటంతో బస్సు రహదారి పిట్టగోడపై నిలిచిపోయింది.

ఈ ఘటనలో పది మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. వెంటనే వీరిని చికిత్స నిమిత్తం తిరుపతి లోని రుయా ఆసుపత్రికి తరలించారు. బస్సు కాస్త ముందుకు వెళ్లి ఉంటే మాత్రం పెను ప్రమాదం జరిగేదని ప్రయాణికులు తెలిపారు.చెట్టుకొమ్మలే తమను కాపాడాయని పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు.