మిట్స్‌ కళాశాలను సందర్శించిన లండన్‌ బ్రూనెల్‌ యూనవర్సిటీ ప్రొఫెసర్‌

0
24
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లి
చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల)ను బ్రిటన్‌ రాజధాని లండన్‌లోని ప్రముఖ బ్రూనెల్‌ విశ్వవిద్యాలయంలో కంప్యూటర్‌ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్‌ జార్జ్‌ ఘినేయా మంగళవారం సందర్శించారు.

ఇందులో భాగంగా కళాశాలలోని అధ్యాపకులకు మరియు విద్యార్థులకు “మల్సిమీడియా – ఆపర్చుని టీస్ ఇన్ ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్” అను అంశంపై అవగాహనా కార్యక్రమాన్నీ నిర్వహించారు. డాక్టర్ జార్జ్ ఘినేయా ముఖ్య అతిథి గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నూతన టెక్నాలజీ మల్సిమీడియా గురించి వివరించారు. ముఖ్యంగా మల్సిమీడియా అనేది ఆధునిక రంగంలో సాఫ్ట్‌వేర్‌ మరియు హార్డ్‌వేర్‌లలో సాధారణమైపోయాయన్నారు.

సౌండ్, గ్రాఫిక్స్ మరియు యానిమేషన్ లు డెస్క్‌టాప్‌ మరియు మొబైల్ లలో వాడే ప్రతి అప్లికేషన్లో ఉన్నాయి. ఇదే విధంగా హ్యూమన్ సెన్సె అనేది రెండు మీడియాలపై పనిచేస్తున్నదని, ఒకటి మల్టీ మీడియా మరియు మల్సిమీడియా అన్నారు. మల్సిమీడియా అనగా మల్టీసెన్సార్ మీడియా. ఇందులో ముఖ్యంగా సెన్సార్ టెక్నాలజీని ఉపయోగిస్తారు.

ఈ సెన్సార్ ల ద్వారా ముందుగా డేటాను క్యాప్చర్ చేసి, మెషిన్ లెర్నింగ్‌ ద్వారా ఆ డేటాను ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ అప్లికేషన్స్ కు పంపుతామన్నారు. ఉదాహరణకు కెమెరా సెన్సార్లు, గ్యాస్ సెన్సార్లు, స్కిన్ సెన్సార్లు, హియరింగ్ సెన్సార్లు మొదలైన వాటి అప్లికేషన్స్ లలో ఈ టెక్నాలజీని వాడుతున్నట్లు ఆయ న అన్నారు.

మల్సిమీడియాలో లీనమయ్యే టెక్నాలజీస్ కొత్త అవకాశాలను కల్పిస్తున్నదని తద్వారా కమ్యూనికే షన్, విద్య, ప్రకటనల మరియు వైద్యరంగాలలో అధునాతన సాంకేతికతలపై ఆపర్చునిటీస్ ఉన్నాయని ఆయన అన్నారు. పరిశోధనలను విద్యార్థులు ఈ రంగంలో చేయాలనీ, అధ్యాపకులు విద్యార్థులకు ఈ రంగంపై అవగహన కల్పించాలన్నారు.

advertisment

బ్రూనెల్ విశ్వవిద్యాలయంలో పరిశోధనలకు విద్యార్థులను మరియు అధ్యాపకులను ఆయన ఆహ్వా నించినారు. ఈ కార్యక్రమంలో బెనర్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ స్వామినాథన్, ప్రిన్సి పాల్ డాక్టర్ సి.యువరాజ్, డీన్ అడ్మిన్ డాక్టర్ శ్రీమంత బసు అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.