మదనపల్లి శ్రీ చైతన్య టెక్నో స్కూల్ లో 10వ తరగతిలో అద్బుత ఫలితాలు

0
91
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని శ్రీచైతన్య టెక్నో పాఠశాల మంగళవారం విడుదలైన 10వ తరగతి ఫలితాలలో అద్బుత ఫలితాలు సాధించిందని ఆ పాఠశాలకు చెందిన మల్లిఖార్జున సర్కిల్, ప్రశాంత్ నగర్ బ్రాంచ్ ల ప్రిన్సిపాల్స్ ఖాదర్ వలి మరియు శ్రీధర్ లు తెలిపారు. 2018-19 విద్యాసంవత్సరంలో తమ పాఠశాలకు మదనపల్లి పట్టణంలో ప్రశాంత్ నగర్ బ్రాంచ్ నుంచి పదవతరగతి పరీక్షలకు హాజరైన 60 మంది విద్యార్థులలో 22మందికి 10కి10 జి.పి.ఏ పాయింట్స్ సాధించగ, మల్లిఖార్జున సర్కిల్ బ్రాంచ్ నుంచి 100 మంది విద్యార్థులు పదవతరగతి పరీక్షలకు హాజరు అయ్యారని అందులో27మంది 10కి10జి.పి.ఎ పాయింట్సు సాధించారని అన్నారు. దీంతో మదనపల్లి పట్టణంలో తమ సంస్థ నుంచి 10వ తరగతి పరీక్షకు హాజరు అయిన 160 మంది విద్యార్థులలో 47 మందికి 10 జి.పి.ఏ పాయింట్లు సాధించారన్నారు. తమ సంస్థలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను, అందుకు అవిశ్రాంతంగా కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని శ్రీచైతన్య విద్యాసంస్థల ఎ.జి.ఎంలు డాక్టర్ ఎ.శ్రీనివాసులు, సురేష్ లతో పాటు ప్రిన్సిపాల్స్ అభినందించారు.