మదనపల్లి లోని సెవెన్ హిల్స్ పాఠశాలలో 10వతరగతి ఫలితాలలో 100శాతం ఫలితాలు

0
58
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లి పట్టణంలోని సెవెన్ హిల్స్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 10వ తరగతిలో 100శాతం ఉత్తీర్ణత సాధించినట్లు పాఠశాల కరస్పాండెంట్ రఘనాథరెడ్డి తెలిపారు. మంగళవారం విడులైన 10 వ తరగతి ఫలితాలలో తమ పాఠశాల నుంచి హాజరైన 18 మంది విద్యార్థులుఅందరూ ఉత్తీర్ణులు అయ్యారని అన్నారు. ఏ.పూజారాయ్ అనే విద్యార్థి 10కి 10 జి.పి.ఏ పాయింట్లు సాధించిందని తెలిపారు. ఎ.వైష్ణవి 9.8 పాయింట్లు సాధించగా, 13 మంది విద్యార్థులు 9.0 జి.పి.ఏ పాయింట్లు సాధించారని కరస్పాండెంట్ రఘునాథరెడ్డి వివరించారు. తమ విద్యాసంస్థ గత 10 సంవత్సరాలుగా ఏటా
10వ తరగతిలో 100శాతం ఫలితాలను సాధిస్తోందని అన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులను, ఇందుకు అహర్నిశలు శ్రమించిన ఉపాధ్యాయ బృందాన్ని కరస్పాండెంట్ అభినందించారు.