మదనపల్లి నారాయణ స్కూల్ లో 10తరగతిలో 36 మందికి 10 పాయింట్లు

0
138
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలోని నారాయణ విద్యాసంస్థలో ఈ ఏడాది 10 వతరగతిలో 140 మంది విద్యార్థులకు గాను 36 మంది 10 పాయింట్లు సాధించినట్లు నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. తమ పాఠశాలలో పరీక్షకు హాజరైన 140 మంది విద్యార్థులలో ఒక విద్యార్థి మినహా మిగిలిన 139 మంది ఉత్తీర్ణతతో 99శాతం ఫలితాలు సాధించినట్లు ఆయన పేర్కొన్నారు. తమ పాఠశాలలో 10కి10 పాయింట్లు సాధించినవారు 36 మంది కాగ, 9.8 పాయింట్లు సాధించినవారు 30 మంది, 9.7 పాయింట్లు సాధించినవారు 15 మంది, 9.5 పాయింట్లు సాధించినవారు 22 మంది, 9.3 పాయింట్లు సాధించినవారు 6 మంది, 9.2 పాయింట్లు సాధించినవారు 8 మంది, 9.0 పాయింట్లు సాధించినవారు 4గురు ఉన్నారని తెలిపారు. 9.0 పాయింట్లు లోపు సాధించినవారు 121 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ఆయన అభినందించారు. వచ్చే ఏడాది మరింత ఉథ్తమ ఫలితాలు సాధిస్తామని అన్నారు.