మదనపల్లిలో ఇంటికి తాళం వేస్తే.. పగలే దొంగతనం ఖాయం – వరుస దొంగతనాలతో జనం బెంబేలు

0
176
advertisment

మనఛానల్ న్యూస్ – మదనపల్లి
మదనపల్లిలో మీరు ఉదయం, సాయంకాలం వేళల్లో చల్లగా ఉంటుందని హాయిగా గుడికో..వాకింగ్ కో వెళ్లుతూ…భద్రంగా మీ ఇంటికి తాళం వేసి వెళ్లుతున్నారా…?? అయితే, దొంగలు మీ ఇంట్లోకి చొరబడి చోరి చేసుకెళ్లడం ఖాయం. మదనపల్లి పట్టణంలో దొంగలు తెలివిమీరిపోయారు. రాత్రివేళ దొంగ తనాలకు స్వస్తి పలికి..పట్ట పగలే ఇళ్లోలోకి వెళ్లి దొంగతనాలు చేయడం మాములు అయిపోయింది. కేవలం వారం రోజుల్లో నాలుగు ఇళ్లలో ఇలాంటి దొంగతనాలు జరగడంతో జనం బెంబేలు ఎత్తుతున్నారు.

వరుసగా సాయంకాలం, ఉదయం వేళల్లో జరుగుతున్న దొంగతనాలను ఏలా నివారించాలో పోలీసులకు అర్థం కావడం లేదు. మదనపల్లి ప్రశాంత్ నగర్ లో రెండు రోజుల క్రితం సాగర్ అపార్టు మెంట్ లోను మరో చోట సాయంకాలం వేళ దొంగతనాలు జరిగాయి. నీరుగట్టుపల్లి వివేకనంద పాఠశాలవెనుక భాగంలో సోమవారం సాయంకాలం ఓ ఇంట్లో, మంగళవారం ఉదయం నీరుగట్టువారిపల్లి లో చీరల వ్యాపారి వెంకటేష్ ఇంట్లో దొంగతనం జరిగింది. నిన్న, ఈరోజు జరిగిన ఈ చోరిలో రూ.3.5లక్షల సొత్తు చోరికి గురైందని సమాచారం.

ఈ దొంగతనానికి పాల్పడ్డ దొంగలు తెలివి మీరి వ్యవహారించారు. దొంగతనం చేశాక వేలిముద్రలు పోలీసు జాగిలాలు గుర్తించకుండా ఉండేందుకు కారపు పొడి చల్లారు. దీనివల్ల దొంగలను గుర్తించడం కష్టం అవుతుంది. ఈ విధంగా వరుస చోరిలతోమదనపల్లి పట్టణంలో జనాలు భయపడుతున్నారు. మరోవైపు పట్టణంలో రాత్రి వేళల్లో పటిష్టమైన పోలీసు నిఘా ఉండడంతో దొంగలు పగటి పూట దొంగ తనాలకు పాల్పడడం మెుదలుపెట్టారు. ఈ సాయంకాలం వేళ దొంగలను ఏవిధంగా పట్టుకోవాలనే దానిపై పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది.

పగటి పూట దొంగతనాలు జరగకుండ ఉండాలంటే ప్రజలు కూడ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమెంతో ఉంది. నిత్యం ఇంటి చుట్టూ తిరుగుతున్న కొత్త వ్యక్తులను గమనించి వారి గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించాలి. మదనపల్లి పట్టణంలో అపార్ట్ మెంట్ల సంస్కృతి ఇప్పుడిప్పుడే మెుదలు కావడంతో వాటి నిర్వహణపై సరైన అవగాహన లేకపోవడం వల్ల పలు సమస్యలు ఎదురౌతున్నాయి. అపార్టు మెంట్ల వద్ద ఖచ్చితంగా వాచ్ మెన్ లు నియమించుకోవడం, కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు వారి వివరాలు రాసుకోవడం, సి.సి కెమారాలు ఏర్పాటు చేయడం, అపార్టు మెంట్ లో నివాసం ఉన్నవారు కనీసం రెండు నెలలకొక సారి సమావేశం కావాలి.దీని వల్ల దొంగతనాలు తగ్గే అవకాశం ఉంది.

అలాగే వీధులలో అనుమానస్పదంగా తిరిగే వారిని ప్రజలు తమ సెల్ ఫోన్లలో రహస్యంగా ఫోటోలు తీసి పోలీసులకు సమాచారం ఇవ్వగల్గితే చోరీలు నివారించవచ్చు. ఇప్పుడు మదనపల్లి పోలీసులకు పగటిపూట దొంగతనాలతో పరేషాన్ అవుతున్నారు. పగటి దొంగల సవాల్ కు మదనపల్లి పోలీసు త్వరలో జవాబు ఇస్తారేమో వేచి చూద్దాం… !!! బీ అలర్ట్ మదనపల్లి పబ్లిక్…!!!!