తెలంగాణలో ప్రారంభమైన చివరిదశ పరిషత్‌ ఎన్నికల పోలింగ్‌

0
17
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
పరిషత్‌ ఎన్నికలు చివరిదశలో భాగంగా తెలంగాణలో మొత్తం 9,494 కేంద్రాల్లో మంగళవారం పోలింగ్‌ జరుగుతోంది.ఉదయం 7 గంటలకే పోలింగ్‌ ప్రారంభమైంది.సగటున ఎంపీటీసీకి ముగ్గురు, జడ్పీటీసీకి ఐదుగురు వంతున అభ్యర్థులు బరిలో ఉన్నారు. మూడు దశల్లోని ఓట్లనూ ఆయా జిల్లాల్లో ఈ నెల 27న లెక్కించి, అదే తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.

జిల్లా, మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలకు 6, 10 తేదీల్లో ఒకటి, రెండు దశల పోలింగ్‌ పూర్తి కాగా, మూడో దశను ఇవాళ నిర్వహిస్తున్నారు. తీవ్రవాద ప్రభావ ప్రాంతాలుగా గుర్తించిన కొమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని 21 మండ లాల పరిధుల్లో గల 205 ఎంపీటీసీ స్థానాల్లో పోలింగ్‌ సాయంత్రం 4 గంటలకు ముగియనుంది.

మిగతా అన్ని చోట్లా సాయంత్రం 5 వరకు కొనసాగుతుంది. మూడో దశలో 1,738 ఎంపీటీసీలు, 161 జడ్పీటీసీల్లో ఎన్నికలను చేపట్టాల్సి ఉండగా ఎంపీటీసీల్లో 30 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఎంపీటీసీ లకు 5,726 మంది బరిలో ఉన్నందున సగటున ఒక్కో స్థానానికి ముగ్గురు చొప్పున పోటీపడుతున్న ట్లయింది.

జడ్పీటీసీలకు 741 మంది రంగంలో ఉండటంతో, సగటున ఒక్కో స్థానానికి ఐదుగురు పోటీలో ఉన్నట్ల యింది. తొలిదశలో వాయిదా పడిన సిద్దిపేట జిల్లా అల్వాల్‌, రంగారెడ్డి జిల్లా అజీజ్‌నగర్‌ ఎంపీటీసీ స్థానాలకు ఇవాళ పోలింగ్‌ నిర్వహిస్తున్నారు.