కథానాయకుడు అవతారమెత్తనున్న దర్శకుడు వి.వి.వినాయక్‌

0
19
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి సెన్సేషనల్‌ డైరెక్టర్‌గా ప్రసిద్ధికెక్కిన వి. వి.వినాయక్‌ కథనాయకుడుగా కనిపించనున్నారు.ఆయన హీరోగా నటిస్తుండడంతో అభిమానులు సర్‌ ఫ్రైజ్‌కు గురయ్యారు.

వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు శంకర్‌ వద్ద సహాయ దర్శకుడిగా పనిచేసిన ఎన్‌. నరసింహారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించను న్నారు.

గతంలో ఈయన ‘శరభ’ అనే సినిమాను తెరకెక్కించారు. మరో రెండు నెలల్లో చిత్రీకరణ ప్రారంభం అవు తుందని చిత్రవర్గాలు వెల్లడించాయి. 2018లో వచ్చిన ‘ఇంటెలిజెంట్‌’ సినిమాకు వినాయక్‌ చివరగా దర్శకత్వం వహించారు.