ఎస్‌ఎస్‌సి ఫలితాల్లో మదనపల్లి సాయివిద్యానికేతన్‌ హైస్కూల్‌ విద్యార్థుల ప్రభంజనం

0
163
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
మంగళవారం విడుదలైన ఏపీ ఎస్‌ఎస్‌సి-2019 ఫలితాల్లో మదనపల్లి పట్టణం నీరుగట్టువారిపల్లిలోని సాయివిద్యానికేతన్‌ హైస్కూల్‌ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాం డెంట్‌ మోడెం శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎస్‌ఎస్‌సి పరీక్ష ఫలితాల్లో తమ పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించిందన్నారు.

పాఠశాల నుండి మొత్తం 26 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని వారిలో నలుగురు విద్యార్థినీ లు మనీలా,రెడ్డిరాణి,స్రవంతి,యజ్ఞేశ్వరిలు 10/10 జీపీఏ సాధించారన్నారు.అదేవిధంగా ఇద్దరు విద్యార్థు లు 9.8 జీపీఏ,6 మంది విద్యార్థులు 9.7 జీపీఏ,ఇద్దరు విద్యార్థులు 9.5 జీపీఏ,5 మంది విద్యార్థులు 9.3 జీపీఏ,ముగ్గురు విద్యార్థులు 9.2 జీపీఏతో పాటు మరోనలుగురు విద్యార్థులు 8.0 జీపీఏపైన మార్కులు సాధించరన్నారు.

26 మంది విద్యార్థులలో నలుగురు 10/10 జీపీఏ, 18 మంది విద్యార్థులు 9.0 జీపీఏపైగా మార్కులు సాధించడం గర్వకారణమన్నారు.ఇంతటి ఘనమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రు లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా విద్యార్థులు ఇంతటి ఉత్తమ ఫలితాలు సాధించడా నికి అహర్నిశలు కృషి చేసిన ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రశంసించారు.