తెలంగాణ ఎస్‌ఎస్‌సి ఫలితాలు విడుదల – 92.43 శాతం ఉత్తీర్ణత

0
8
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – హైదరాబాద్‌
తెలంగాణలో పదవతరగతి (ఎస్‌ఎస్‌సీ) పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.సచివాలయం డి బ్లాక్‌ కాన్ఫ రెన్స్‌ హాల్‌లో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి సోమవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రంలో మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 3 వరకు జరిగిన పదో తరగతి పరీక్షలకు దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు హాజరవ్వగా 92.43 శాతం ఉత్తీర్ణత నమోదైంది.

బాలికల ఉత్తీర్ణత శాతం 93.68 కాగా, బాలుర ఉత్తీర్ణత శాతం 91.18 శాతంగా నమోదైంది. టెన్త్ ఫలితా ల్లో జగిత్యాల మొదటి స్థానంలో నిలవగా, హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది.అలాగే పాఠశాలలు, విద్యార్థులు తమ ఫిర్యాదులను నమోదు చేసేందుకు టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆ యాప్‌ను డబ్యూడబ్ల్యూడబ్ల్యూ. బీఎస్‌ఈ.తెలంగాణ.జీఓవి.ఐఎన్‌ వెబ్‌సైట్‌ నుంచి డౌన్లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

మొబైల్‌ ప్లే స్టోర్‌ నుంచి కూడా టీఎస్‌ఎస్‌ఎస్‌సీ బోర్డు అని టైప్‌ చేసి ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చ ని వివరించింది. డౌన్‌లోడ్‌ చేసుకున్న తరువాత విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్, పుట్టిన తేదీ నమోదు చేసి లాగిన్‌ కావాల్సి ఉంటుంది. లాగిన్‌ అయ్యాక అందులో పేరు, పాఠశాల విద్యార్థుల హాల్‌ టికెట్‌ నంబర్‌ వస్తాయి. అలాగే విద్యార్థులు తమ మొబైల్‌ నంబర్‌ను రెండుసార్లు నమోదు చేయాలి.

మెయిల్‌ ఐడీని నమోదు చేసి సేవ్‌ చేయాలి. విద్యార్థులు ఫలితాలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయాలనుకుంటే గ్రీవెన్సెస్‌లోకి వెళ్లి దానిని సెలెక్ట్‌ చేసి, టెక్ట్స్‌ బాక్స్‌లో ఫిర్యాదు రాసి సబ్మిట్‌ చేయాలి. ఆ తరువాత కన్‌ఫర్మేషన్‌ మేసేజ్‌ విద్యార్థుల మొబైల్‌ నంబర్‌కు వస్తుంది. అయితే ఇందులో ఒక్కసారే ఫిర్యాదు చేయడానికి వీలు ఉంటుంది.