ఢిల్లీ ఖేల్‌ఖతం – ఐపీఎల్‌ ఫైనల్లో ప్రవేశించిన చెన్నై

0
28
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – స్పోర్ట్స్‌ డెస్క్‌
ఐపీఎల్‌ సీజన్‌-12 ఢిల్లీ కేపటిల్స్‌ జట్టు ప్రయాణం ముగిసింది. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు చేరే అవకాశాన్ని చేజార్చుకుంది.ఒత్తిడి తట్టుకోలేక కుర్రాళ్ల జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ధోనీ నేతృ త్వంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌కు సునాయాసంగా తలొగ్గింది. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 12వ సీజన్‌లో రెండో క్వాలిఫయర్‌లో 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

ఆ జట్టు నిర్దేశించిన 148 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని చెన్నై ఆడుతూ పాడుతూ ఛేదించింది. ముంబయి తో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. 12 సీజన్లలో చెన్నై 8వ సారి ఫైనల్‌ చేరుకోవడం గమనార్హం. నిషేధం కారణంగా అందులో 2 ఎడిషన్లు ఆడనేలేదు. దిల్లీలో రిషభ్‌ పంత్‌ (38; 25 బంతుల్లో 2×4, 1×6) మినహా మరెవరూ రాణించలేదు.

ఛేదనలో ఓపెనర్లు షేన్‌ వాట్సన్‌ (50; 32 బంతుల్లో 3×4, 4×6), డుప్లెసిస్‌(50; 39 బంతుల్లో 7×4, 1×6) చెలరేగి ఆడారు. అద్భుతమైన షాట్లతో విరుచుకుపడ్డారు. అర్ధశతకాలు సాధించారు. కాగా తొలి 4 ఓవర్లకు వారు చేసింది 16 మాత్రమే. ఐదో ఓవర్‌ నుంచే వారి ఊచకోత మొదలైంది. ఆ తర్వాత ఎక్కడా ఆగలేదు.

మొదట డుప్లెసిస్‌ చితకబాది అర్ధశతకం సాధించాడు. జట్టు స్కోరు 81 వద్ద బౌల్ట్‌ బౌలింగ్‌లో వెనుది రిగాడు. ఆ తర్వాత వాట్సన్‌ ఊచకోత మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా అతడూ అర్ధశతకం చేయగానే వెనుదిరిగాడు. అప్పుడు స్కోరు 109. అప్పటికే విజయం చెన్నై వైపు మొగ్గడంతో ఇబ్బంది లేకపో యింది.

రైనా (11; 13 బంతుల్లో), అంబటి రాయుడు (20*; 20 బంతుల్లో 3×4) నిలకడగా ఆడారు. ఎంఎస్‌ ధోనీ (9; 9 బంతుల్లో 1×4) జట్టు రెండు పరుగులు చేస్తే విజయం సాధిస్తుందనగా గెలుపు షాట్‌ ఆడ బోయి వెనుదిరిగాడు.