క్యాడెట్‌ వెల్ఫేర్‌ సొసైటీ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన మిట్స్‌ ఎన్‌.సి.సి క్యాడెట్‌

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – మదనపల్లె
చిత్తూరుజిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద గల మదనపల్లి ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ & సైన్స్‌ (మిట్స్‌ కళాశాల) నందు బీ.టెక్ మొదటి సంవత్సరము చదువుతున్న కె.బాలాజీ అను ఎన్.సి.సి క్యాడెట్ (క్యాడెట్ వెల్ ఫేర్ సొసైటీ) స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లుగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువ రాజ్ తెలిపారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్.సి.సి తరుపున స్కాలర్‌షిప్‌ అందుకున్నట్లు ఆయన అన్నారు. ఈ ఎన్.సి.సి క్యాడెట్ యొక్క ప్రతిభ ఆధారంగా ఈ స్కాలర్‌షిప్‌కి ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. ఈ విద్యార్థికి 6000/- (ఆరు వేల రూపాయలు) స్కాలర్‌షిప్‌ అందినట్లుగా తెలిపారు.

ప్రతి సంవత్సరము యెన్.సి.సి. క్యాడెట్స్ కు విద్యా మరియు యెన్.సి.సి పనితీరు ఆధారంగా జాతీయ స్థాయిలో 1000 మందికి అందజేస్తారని ఆయన అన్నారు. 35 ఆంధ్ర బెటాలియాన్ యెన్.సి.సి, చిత్తూ రు వారు ఈ విద్యార్ధికి ధ్రువీకరణ పత్రాన్ని అందజేస్తారని తెలిపారు.

ఈ స్కాలర్‌షిప్‌కి ఎంపికైన కె.బాలాజీని కళాశాల యాజామాన్యం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి.యువ రాజ్, ఎన్.సి.సి లెఫ్టినెంట్ డాక్టర్.నవీన్ కుమార్ తదితరులు అబినందనలు తెలిపారు.