కొత్త అవతారమెత్తనున్న మిల్కీ బ్యూటీ తమన్నా

0
108
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
పలు వైవిధ్యమైన పాత్రల్లో నటించి పలు భాషల్లో తనకంటూ ఒక ఇమేజ్‌ సంపాదించుకున్నారు కథా నాయికి తమన్నా భాటియా. అగ్రకథానాయకుల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలపై దృష్టిసారిస్తున్నది.

నిజం చెప్పాలంటే బాహుబలి వంటి ఒకటి రెండు చిత్రాల్లో తనలోని నటనా ప్రతిభను చాటుకునే అవ కాశం వచ్చినా, చిత్రాన్నంతా తనపై వేసుకుని మోసే సత్తా కలిగిన అవకాశం 10 ఏళ్లు దాటిన తన కెరీర్‌ లో లభించలేదనే చెప్పాలి. ఇటీవల తెలుగు చిత్రం ఎఫ్‌2 హిట్‌ కావడంతో చాలా ఖుషీగా ఉన్న ఈ మిల్కీ బ్యూటీకి మరింత జోష్‌ను అందించేలా వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

ముఖ్యంగా కోలీవుడ్‌లో మంచి ఫేమ్‌లో ఉన్నారు. తమన్నా, ప్రభుదేవా జంటగా నటించిన దేవి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. ప్రస్తుతం విశాల్‌తో ఒక చిత్ర షూటింగ్‌లో ఉన్నారు.తరువాత మరో చిత్రంలోనూ ఆయనతో రొమాన్స్‌ చేయడానికి ఓకే చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో హీరోయిన్‌ సెంట్రి క్‌ కథా చిత్రంలోనూ నటించే అవకాశం తమన్నాను వరించింది.

ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని అదే కన్‌గళ్‌ చిత్రం ఫేమ్‌ రోహిన్‌ వెంకటేశన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరో అంటూ ఎవరూ ఉండరట. అయితేనేం హీరోలు లేని కొరతను తీర్చేస్తున్న కమెడియన్‌ యోగిబాబు ఉండనే ఉన్నాడు. ఇటీవల ఇతను లేని చిత్రమే లేదని చెప్పవచ్చు.