మహర్షి సంబరాల్లో పాలుపంచుకున్న రష్మిక, విజయ్‌ దేవరకొండ

0
31
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
మే 9న ప్రపంచ వ్యాప్తంగా 2 వేల థియేటర్లలో విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది మహర్షి సినిమా.మ‌హేష్ కెరీర్‌లో మ‌హ‌ర్షి చిత్రం మైలురాయిగా నిలిచిపోతుంద‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస లు కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే.వంశీ పైడిప‌ల్లి ఈ చిత్రాన్ని చాలా ఎమోష‌న‌ల్‌గా తెర‌కెక్కించగా, తాను నమ్మిన ఓ విలువ నుంచి మరో ఉన్నతమైన విలువ వరకు ఓ యువకుడు చేసే ప్రయాణమేమిటన్నది మ‌హ‌ర్షి చిత్రంలో చూపించారు.

ఇలాంటి ఫిలాసఫికల్ పాయింట్‌ను చక్కెర పూతవంటి కమర్షియల్ అంశాల మేళవింపుతో చెప్పే ప్రయ త్నం చేశారు. తొలి అర్ధభాగాన్ని కాలేజీ నేపథ్యంలో నడిపించారు. ఇందులో మహేష్‌బాబు, అల్లరి నరేష్, పూజాహెగ్డే మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. ముగ్గురు మధ్య చక్కటి హాస్యాన్ని పండించారు. రిషి తన అసలు ప్రయాణమేమిటో అని తెలుసుకోవడంతో తొలి అర్థభాగం ముగుస్తుంది.

ద్వితీయార్థంలోని సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగాయి. గ్యాస్‌పైప్‌లైన్ ప్రాజెక్ట్ నెపంతో ఊరిని కబళించాలని చూసే కార్పొరేట్ శక్తుల దుర్మార్గానికి రిషి చలించిపోతాడు. అటు స్నేహితుడు రవి రుణం తీర్చుకోవడానికి, మరోవైపు ఊరిని రక్షించుకోవడానికి రిషి చేసే ప్రయత్నాలు ఎమోషనల్‌గా సాగాయి. ద్వితీయార్థంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నదాత దుస్థితిని అర్థవంతమైన సన్నివేశాలు, సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేశారు.

ఊరి మేలు కోసం రిషి ఎంతవరకు పోరాటం చేశాడనే అంశాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కి క‌నెక్ట్ కావ‌డంతో చిత్రానికి ఆద‌ర‌ణ మ‌రింత పెరుగుతుంది. మూవీకి పాజి టివ్ టాక్ రావ‌డంతో చిత్ర నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి, పూజా హెగ్డే, దేవి శ్రీ ప్రసాద్‌ మ‌హేష్‌ లు నిన్న రాత్రి మ‌హర్షి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుకున్నారు. ఈ సెల‌బ్రేష‌న్స్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంథాన‌, అనీల్ రావిపూడి పాల్గొన‌డం విశేషం.