ఉపాధిహామీ పథకం నిర్వీర్యం – వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు

0
25
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – కురబలకోట
ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కుట్ర పన్నుతున్నాయని, ఆ కుట్రను నిర్వీర్యం చేయడానికి ఉపాధి కూలీలు అందరూ ఏకమై పోరాటాలకు సిద్ధం కావాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం చిత్తూరు (పశ్చిమ) జిల్లా కన్వీనర్ పి.శ్రీనివాసులు అన్నారు.

శుక్రవారం తంబళ్లపల్లి నియోజకవర్గం కురబలకోట మండలంలోని దిగువబోయపల్లి, దాదంవారిపల్లి, ముదివేడు ప్రాంతాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలను అడిగి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఉపాధి పనులను ఎంతో కష్టపడి చేస్తున్న ఉపాధి కూలీలకు కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలపై పోరాటాలకు సిద్ధం కావాలని,అందుకోసం అందరూ ఏకం కావాలన్నారు.ఈ సంవత్సరం ఎండలు తీవ్రంగా ఉన్నాయని, ఎండల్లోనే కూలీలు పనులు చేస్తూ ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతున్నారన్నారు.

ఈ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి జీతాలు పెంచుకుంటున్నారు తప్ప, ఎండలో కష్టపడుతున్న ఉపాధి కూలీలకు కనీస వేతనం 200 రూపాయలు కూడా ఇవ్వడం లేదన్నారు. ఫస్ట్ ఎయిడ్ కిట్ అంటే ఎమి టో కూలీలకు తెలియదు. క్యూబిక్ మీటర్ కంటే ఎక్కువ పని చేస్తున్నా 200రూపాయలకు మించి కూలీ రావడం లేదని, అదేమంటే అంతకు మించి కంప్యూటర్ తీసుకోదని అధికారులు చెప్పడం దుర్మార్గమ న్నారు. పే స్లిప్పులు ఎప్పుడో ఒకసారి ఇస్తారు. పే స్లిప్పులు ఇచ్చినా ఖాతాలలో జమ కావు.

పోస్ట్ ఆఫీసు నుండి బిల్లులు ఇచ్చేటప్పుడు వారం, వారం ఇంటికి వచ్చి బిల్లులు చెల్లించేవారు. బ్యాంక్ ద్వారా ఎప్పుడు ఇస్తారో తెలియదు. బిల్లులు తమ ఖాతాలలో పడినాయో లేదో కూడా తెలియదు. గడ్డపార, తట్టలు, పారలు ఏమీ ఇవ్వలేదు.ఇన్ని బాధలు పరిష్కారం కావాలంటే కూలీలు ఐక్యం కావడ మే మార్గమని తెలిపారు. ఉపాధి కూలీలకు కేరళ రాష్ట్రంలో ఇస్తున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా కనీస వేతనం 600 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పని అడిగిన ప్రతి కుటుంబానికి పని చూపాలని, ఎండలో తట్టుకోవడానికి మజ్జిగ, నీరు, టెంట్లు ఏర్పా టు చేయాలని, మెడికల్ కిట్లు ఇవ్వాలని, ప్లే స్లీప్ లు ఇవ్వాలని, పెండింగులో వున్న బిల్లులు ఇవ్వాలని వారం,వారం బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీల సమస్యలు పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల్లోని ఉపాధి కూలీలు, మేట్లు పాల్గొన్నారు.