ఆసక్తిని రేకెతిస్తున్న కాజల్‌, బెల్లంకొండ శ్రీనివాస్‌ ‘సీత’ సినిమా ట్రైలర్‌

0
84
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – సినిమా డెస్క్‌
బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడుగా నటిస్తూ,కథానాయిక కాజల్‌ అగర్వాల్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న చిత్రం ‘సీత’.ఈ సినిమాకు తేజ దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే.శుక్రవారం విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.ఫైటింగ్‌, యాక్సిడెంట్‌ సన్నివేశాలతో ట్రైలర్‌ మొదలైంది.

‘నా పేరు సీత నేను గీసిందే గీత. ప్రాస బాగుంది కదా’ అని కాజల్‌ చెప్పే డైలాగ్‌ విని ‘ఇది కంచుకే కంచులా ఉందిరా బాబూ..’ అంటూ తనికెళ్ల భరణి వణికిపోతూ అనడం నవ్వులు పూయిస్తోంది. ఇందులో రామ్‌ (బెల్లంకొండ శ్రీనివాస్‌) అమాయకపు యువకుడిగా నటించారు. అతన్ని సీతే (కాజల్‌) దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది.

సోనూ సూద్‌ ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ‘రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం తప్పు కాదండి. రాముడి భార్యను ఎత్తుకెళ్లడం తప్పు’ అని ట్రైలర్‌ చివర్లో శ్రీనివాస్‌ చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచిం ది. ఇందులో మన్నారా చోప్రా మరో కథానాయికగా నటించారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. మే 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.