సుప్రీంకోర్టుకు క్షమాపణలు చెప్పిన రాహుల్‌గాంధీ

0
31
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – నేషనల్‌ డెస్క్‌
సుప్రీంకోర్టుకు బేషరతు క్షమాపణలు కోరుతూ బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ అఫడవిట్‌ దాఖలు చేశారు.రఫేల్‌ కేసు వ్యవహారానికి సంబంధించి కాపలాదారే దొంగ అని సర్వోన్నత న్యాయస్ధానం చెప్పిందని గతంలో తాను చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు.

తనపై నమోదైన కోర్టు ధిక్కార పిటిషన్‌ను కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై శుక్రవారం విచారణ చేప డతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.గౌరవ న్యాయస్ధానానికి తాను అన్యాపదేశంగా తన ఉద్దేశాన్ని ఆపాదించినందుకు బేషరతుగా క్షమాపణలు చెబుతున్నానని, తాను ఉద్దేశపూర్వకంగా ఈ వ్యాఖ్యలు చేయలేదని అఫిడవిట్‌లో రాహుల్‌ పేర్కొన్నారు.

కాగా రఫేల్‌ ఒప్పందంలో చౌకీదారే దొంగ అంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని రాహుల్‌ చేసిన వ్యాఖ్య లు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయని బీజేపీ నేత మీనాక్షి లేఖి సర్వోన్నత న్యాయస్ధానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.