ఒంటిమడక దుక్కులతో రైతులకు ఉపయోగం – బి.కొత్తకోట ఏ.వో.ప్రేమలత

0
384

మనఛానల్‌ న్యూస్‌ – బి.కొత్తకోట
ఒంటిమడక దుక్కుతో రైతన్నలకు ఎంతో ఉపయోగమని బి.కొత్తకోట వ్యవసాయాధి కారిణి ప్రేమలత అన్నారు.బుధవారం మండలంలోని రైతులకు ఒంటిమడక వినియోగం, వాటి వలన కలిగే అదనపు లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు.

ఇందులో భాగంగా గోళ్లపల్లి, దిండిమీదపల్లి గ్రామాల్లోని రైతులకు క్షేత్రస్థాయిలో వివిధ రకాల వ్యవసాయ పద్ధతులపై వివరించారు.ఈ సందర్భంగా ఏ.వో ప్రేమలత మాట్లాడుతూ ఖరీఫ్‌ సాగులో భూమి దున్నకం ,వేరుశనగ విత్తనాలు విత్తటం,అంతర పంట సాగు పద్ధతులపై రైతులకు మెళుకువలు నేర్పించారు.

కొద్దిపాటి మెళుకులు పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చునని,తద్వారా వ్యవసాయాన్ని లాభ సాటిగా మార్చుకోవచ్చునన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతులు దుక్కులకు సన్నద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో ఏఏవో ఫయాజ్‌, రైతులు తదితరులు పాల్గొన్నారు.