విడుదలైన ఏపీ ఐసెట్‌ ఫలితాలు – టాప్‌ టెన్‌ ర్యాంకర్ల వివరాలు

0
221

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
ఎంబిఏ, ఎంసిఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను నిర్వహించిన ఏపీ ఐసెట్‌-2019 ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌ విజయరాజు, వెంకటేశ్వర వర్సిటీ వీసీలు ఈ ఫలితాలను విడుదల చేశారు.

ఎంబీఏ, ఎంసీఏలలో ప్రవేశాలకు నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షకు 48,445మంది విద్యార్థులు హాజరవ్వగా 90.27 శాతం ఉత్తీర్ణత సాధించారు. జులై మూడోవారం నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఏపీ ఐసెట్‌ ఫలితాలలో తొలి పదిర్యాంకులు సాధించిన విద్యార్థులు

1వ ర్యాంకు – కారుమూరి నాగసుమంత్‌ (గుంటూరు జిల్లా)
2వ ర్యాంకు – కె.కావ్యశ్రీ(తూర్పుగోదావరి జిల్లా)
3వ ర్యాంకు – ఎన్‌.శివసాయి పవన్‌(విజయవాడ)
4వ ర్యాంకు – యాగంటి ముని చంద్రారెడ్డి(కడప)
5వ ర్యాంకు – ఒ.భాను ప్రకాశ్‌(చిత్తూరు)
6వ ర్యాంకు – ఎం.వెంకటనాగేంద్ర(విశాఖ)
7వ ర్యాంకు – పి.వెంకటలక్ష్మి కిరణ్మయి(తూర్పుగోదావరి)
8వ ర్యాంకు – కె.భానుప్రకాశ్‌రెడ్డి(చిత్తూరు)
9వ ర్యాంకు – ఎ.అఖిల్‌(హైదరాబాద్‌)
10వ ర్యాంకు – అంబటి సురేందర్‌రెడ్డి(కర్నూలు)