నదిలో దిగిన విమానం – ప్రయాణికులు సురక్షితం

0
133
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎన్‌ఆర్‌ఐ డెస్క్‌
ల్యాండింగ్‌ సమయంలో అదుపుతప్పి బోయింగ్‌ 737కు చెందిన ఒక కమర్షియల్‌ జెట్‌ మిమానం నది లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదకర సంఘటన అగ్రరాజ్యం అమెరికాలోని ఫ్లోరిడాలో చోటుచేసుకుంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు.

వివరాల్లోకి వెళితే 136 మంది ప్రయాణికులతో బోయింగ్‌ విమానం క్యూబా నుంచి బయల్దేరింది. అయితే నావల్‌ స్టేషన్‌ గంటానమో బేలో ల్యాండ్‌ అవుతున్న సమయంలో జాక్సన్‌విల్లేలోని సెయింట్‌ జాన్స్‌ నది లోకి దూసుకువెళ్లిందని నావల్‌ ఎయిర్‌స్టేషన్‌ అధికార ప్రతినిధి తెలిపారు.శుక్రవారం రాత్రి 9.40 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన నుంచి ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారని జాక్సన్‌విల్లే మేయ ర్‌ ట్వీట్‌ చేశారు.

వారంతా బతికే ఉన్నారని కుటుంబ సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన జాక్సన్‌విల్లే షరిఫ్స్‌ ఆఫీస్‌ కూడా ప్రమాద సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం జరుగలేదని ట్వీట్‌ చేసింది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.