కొత్త రూ.20 నోటు నమూనాను విడుదల చేసిన ఆర్‌బీఐ

0
89
advertisment

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
కొత్త రూ.20 నోట్లను త్వరలో రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా విడుదల చేయనుంది.ఈ కొత్త 20 రూపాయల నోటు నమూనాను ఆర్‌బీఐ శనివారం విడుదల చేసింది.మహాత్మా గాంధీ సిరీస్‌లో ఈ నోట్లు ఆకుపచ్చ, పసుపు కలగలిసిన రంగులో ఉండనున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.

ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సంతకం ఉండే ఈ నోటు ముందు భాగంలో మహాత్మాగాంధీ బొమ్మ, పక్కనే దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటుంది. దీంతోపాటు అశోకుడి స్థూపం కూడా ఉంటుంది.

ఇక నోటు వెనకభాగంగంలో ఎల్లోరా గుహల చిత్రంతోపాటు స్వచ్ఛ భారత్‌ లోగో, నినాదం ఉంటాయి. కొత్త నోట్లు వచ్చినప్పటికీ పాత రూ.20 నోట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేసింది.