జీఎస్టీ వసూళ్లలో అగ్రగామిగా నిలిచిన ఆంధ్రప్రదేశ్‌

0
303

మనఛానల్‌ న్యూస్‌ – అమరావతి
జీఎస్టీ అమలైనప్పటి నుండి ఆంధ్రప్రదేశ్‌లో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి.దీంతో జీఎస్టీ వసూ ళ్లలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిచింది.బెంచ్ మార్క్ దాటి 4 శాతం అదనంగా వసూళ్లు అయ్యాయి. జీ ఎస్టీ అమల్లోకి వచ్చాక ఏపీలో పన్ను వసూళ్లు ఒక్కసారి కూడా తగ్గలేదు.

వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ 14.98 శాతం వృద్ధి సాధించింది. అదేవిధంగా జీఎస్టీ పరిధిలో పన్ను వసూళ్లు 18.10 శాతం వృద్ధి, 21087 కోట్ల వసూళ్లు. పెట్రో ఉత్పత్తుల విక్రయాల్లో 10 .68 శాతం జీఎస్టీ వృద్ధి, 10,829.85 కోట్ల వసూళ్లు.

మద్యం విక్రయాల్లో 13.82 శాతం జీఎస్టీ వృద్ధి, 10,915.7 కోట్ల పన్ను వసూళ్లు. వృత్తి పన్ను వసూళ్ల లో 3.5 శాతం జీఎస్టీ వృద్ధి , 221.28 కోట్ల వసూళ్లు సాధించింది. 2017-18లో 37,444.95 కోట్లు 2018-19లో 5,608 కోట్ల పెరుగుదలతో 43,053 కోట్లు 2017-18లో 53 వేల కోట్ల వార్షిక పన్ను వసూళ్లు, 18-19లో 60 వేల కోట్ల పన్నులు వసూళ్లయ్యాయి.