ఈ రోజు ప్రధాన వార్తలు సంక్షిప్తంగా….

0
641

మనఛానల్ న్యూస్ – న్యూస్ డెస్క్

1.కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల అనంతరం పేదరికం నిర్మూలనకు సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధి అన్నారు.శుక్రవారం ఆయన బీహార్ రాష్ట్రంలోని పలుప్రాంతాలలో ఎన్నికల ప్రచార సభలలో పాల్గోని ప్రసంగించారు. ప్రతి వ్యక్తికి కనీస ఆదాయ పథకం కింద భృతి కల్పిస్తామని తెలిపారు. మోది ప్రభుత్వం తీసుకొచ్చిన గబ్బర్ సింగ్ టాక్స్ ను పునర్ సమీక్ష చేస్తామని తెలిపారు.


2.సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ శుక్రవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను లక్నోలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ములాయం కేవలం గ్యాస్టిక్ మరియు నరాల సంబంధమైన వ్యాధితో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. ఆయన ఈ రాత్రికి డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు తెలిపారు. ములాయం ప్రస్తుతం లోకసభ ఎన్నికలలో మెయినాపురి నుంచి పోటి చేస్తున్నారు.

3.కర్ణాటకలోని కర్వార్ ఓడ రేవుకు సమీపంలో ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. కంపార్ట్‌మెంట్‌పై చెలరేగిన మంటలను ఆర్పేందుకు లెఫ్ట్‌నెంట్ కమాండర్ డీఎస్ చౌహాన్ ధైర్యంగా చర్యలు తీసుకున్నట్లు నేవీ ఓ ప్రకటనలో తేలిపింది.మంటలు అదుపులోకి వచ్చే సమయానికి పొగ కారణంగా అధికారి అపస్మారకస్థితిలో వెళ్లాడు. వెంటనే చికిత్స నిమిత్తం నేవీ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లుగా వైద్యులు ప్రకటించారు.

4.భారత ప్రధాని నరేంద్ర మోది జీవిత చరిత్రకు సంబంధించి హింది నటుడు వివేక్ ఒబరాయ్ తో తీసిన బయోపిక్ విడుదలను నిలిపివేస్తూ భారత ఎన్నికల సంఘం తీసుకొన్న నిర్ణయాన్ని తాము సమీక్షించలేమని సుప్రీంకోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగాయ్ నేతృత్వంలో బెంచ్ ఈ విషయాన్ని వెల్లడిచేసింది. మే19 వతేది తర్వాత ఈ బయోపిక్ విడుదల చేసుకోవచ్చనని కోర్టు వివరించింది.

5.రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను తనిఖి చేసిన నివేదకను వెల్లడించడానికి చిట్టచివరిగా మరో అవకాశాన్ని ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు శుక్రవారం వెల్లడించింది. బ్యాంకింగ్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని దానిని తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవచ్చనని తెలిపింది. అయతే బ్యాంకులు ఈ విషయంలో నిర్లక్యం వహిస్తున్నాయని కోర్టు అభిప్రాయపడింది. మరో మారు ఇలానే వ్యవహారిస్తే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.


6.సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగొయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలపై సమగ్ర దర్యాప్తుకు ముగ్గురు సభ్యులతో వేసిన కమిటి నుంచి జస్టిస్ ఎన్.వి రమణ తప్పుకోవడంతో ఆయన స్థానంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇందు మల్హోత్రను నియమించారు.

7.ఆశ్రమ నిర్వహకుడు ఆశారాం బాపు కుమారుడు నారాయణ్ సాయి మహిళపై అత్యాచారం కేసులో దోషిగా సూరత్ కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. అతనికి ఎన్ని రోజులు పాటు ఖైదుగా ఉండాల్సింది ఈ నెల 30న ఖరారు చేస్తామని కోర్టు వెల్లడించింది. కేసు పూర్వపరాలు ఇవి. సూరత్‌కు చెందిన ఇద్దరు అక్కాచెళ్లెళ్లు 2013లో పోలీసులను ఆశ్రయించారు. ఆశారాం బాపు, అతడి కొడుకు నారాయణ్ సాయి ఇరువురు తమపై అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆశ్రమంలో నివసించే సమయంలో 2002 నుంచి 2005 మధ్య కాలంలో తనపై నారాయణ్ సాయి పలుమార్లు అత్యాచారం చేశాడని పేర్కొంటూ అక్కాచెళ్లెళ్లలో ఒకరు తెలిపారు. ఈ కేసులో పోలీసులు తీవ్ర గాలింపు అనంతరం నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆశారాం బాపు సైతం ఓ అత్యాచారం కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదుని అనుభవిస్తున్నాడు.