ఆర్‌బీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం కోర్టు

0
86

మనఛానల్‌ న్యూస్‌ – ఎకానమీ డెస్క్‌
సమాచార హక్కు చట్టం కింద దేశంలోని పలు బ్యాంకులకు చెందిన వార్షిక తనిఖీ నివేదికలను బహిర్గ తం చేయాలని శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానం రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియాకు ఆదేశాలు జారీ చేసింది.

ఆర్‌టీఐ చట్టం కింద ఆ సమాచారాన్ని వెల్లడించడంపై తన విధానాలను ఓసారి సమీక్షించుకోవాలని జస్టిస్‌ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం ఆర్‌బీఐకు సూచించింది. చట్టం కింద వెల్లడించా ల్సిన బాధ్యత ఉందని తెలిపింది.

చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెళ్లడానికి ఇది ఆర్‌బీఐకి ఇస్తున్న చివరి అవకాశ మని ధర్మాసనం స్పష్టం చేసింది. దాన్ని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయమై ఈ ఏడాది జనవరిలో న్యాయస్థానం ఆర్‌బీఐకు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది.

బహిర్గతం చేయలేని అంశాలను చట్టం నుంచి మినహాయిస్తే తప్ప ఆర్‌టీఐ దరఖాస్తుదారుడికి సమాచా రాన్ని ఇవ్వకుండా ఆర్‌బీఐ తోసిపుచ్చలేదని సుప్రీం, కేంద్ర సమాచార కమిషన్ వెల్లడించాయి. దీనికి సంబంధించి ఎస్‌సీ అగర్వాల్ అనే ఆర్టీఐ కార్యకర్త న్యాయస్థానంలో ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు.