అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ట్విట్టర్ సి.ఇ.ఓ జాక్

0
62
advertisment

మనఛానల్ న్యూస్ – ఇంటర్నేషల్ డెస్క్
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ సి.ఇ.ఓ జాక్ డొర్సే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో సమావేశం అయ్యారు. ఈసందర్భంగా వారు ప్రస్తుతం రోజు రోజుకు సోషల్ మీడియా పాత్ర పై చర్చించారు.దీనికి సంబంధించిన ఫోటోను సి.ఎన్.ఎవ్ వార్త సంస్థ బుధవారం విడుదల చేసింది.

ఈ మద్యాహ్నం వేళ అనేక విషయాలను అధ్యక్షుడు ట్రంప్ తో సుధీర్ఘంగా మాట్లాడినట్లు ట్విట్టర్ సి.ఇ.ఓ జాక్ డోర్సే వెల్లడించారు. ట్విట్టర్ సి.ఇ.ఓతో జరిగిన సమావేశంలో వైట్ హౌస్ సోషల్ మీడియా డైరక్టర్ డాన్ స్కావినో మరియు ట్విట్టర్ లీగల్, పాలసీ, ట్రస్ట్ అండ్ సేప్టీ విభాగం అధినేత్రి విజయ గద్దే కూడ పాల్గోన్నారు. సోషల్ మీడియాలో అధ్యక్షుడు ట్రంప్ పై వస్తున్న వ్యతిరేక ట్విట్లు, ప్రతి పక్షపార్టీలు విమర్శ ట్విట్లపై చర్చించారు.